శ్రీశైలం పుణ్య క్షేత్రంలో అరుదైన ఘటన.. శివుడి వద్దకు చేరిన వాసుకి!

by Ramesh Goud |
శ్రీశైలం పుణ్య క్షేత్రంలో అరుదైన ఘటన.. శివుడి వద్దకు చేరిన వాసుకి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీశైలం మల్లికార్జున స్వామి పుణ్య క్షేత్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పాతాల గంగ వద్ద నాగుపాము చంద్రలింగాన్ని చుట్టుకొని ఉండటం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా నల్లమల్ల అడవుల్లో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఎల్లప్పుడూ భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శివభక్తులు పెద్ద ఎత్తున తరిలి వస్తుంటారు. శ్రీశైలంలో పాతాల గంగ వద్ద చంద్ర లింగేశ్వర స్వామి ఉంది. అక్కడ ప్రతిరోజు భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం కూడా ఆలయ ప్రాంగాణాన్ని శుభ్రం చేసి పూజలు చేశారు. అనంతరం ఓ పెద్ద నాగుపాము అక్కడికి వచ్చి చంద్ర లింగాన్ని చుట్టుకొని కనిపించింది. ఇది చూసిన భక్తులు మల్లికార్జుని వద్దకు వాసుకి స్వయంగా వచ్చింది చేరుకుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలుసుకున్న శ్రీశైల భక్తులు.. ఈ అద్భుతాన్ని చూసేందుకు ఎగబడ్డారు. దీనిపై భక్తులు ఈ పరిసరాల్లో పాములు తిరుగుతుంటాయి కానీ ఇలా ఎప్పుడు జరగలేదని అంటున్నారు. ఈ సంఘటనను కొందరు భక్తులు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Next Story