- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుష్ప ఇక్కడికి వచ్చాడు ఓటు వేస్తారా ..?- చంద్రబాబు నాయుడు
దిశ, మార్కాపురం:వైసీపీ అభ్యర్థిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ప్రకాశం జిల్లా మార్కపురంలో ప్రజాగళం సభలో బాబు మాట్లాడుతూ.. జిల్లా వైసీపీ అభ్యర్థి ఓ పుష్ప అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెడ్ శాండిల్ స్మగ్లర్ పుష్ప ఇక్కడికి వచ్చాడు.. ఆయనకు ఓటు వేస్తారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట సామాన్యుడు, మంచి సేవ భావంతో రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. మాగుంటకు మీ అమూల్యమైన ఓటు వేయాలంటూ, అలాగే మీ అందరికీ అందుబాటులో ఉండే కందుల నారాయణ రెడ్డి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని అనేక సర్వేలు నిర్వహించక మీ అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. మద్యపాన నిషేధం చేస్తానంటూ అందరినీ మోసం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. మద్యపానం నిషేధం చేశాడా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తెస్తానని తీసుకొచ్చాడా, కేంద్రం మెడలు వంచుతా అని ఎన్నికల ముందు చేప్పిన జగన్ ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేదు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక్కడకు అనేక సార్లు వచ్చానని కానీ ఇప్పుడు మీ ఉత్సాహం చూస్తుంటే ఎన్డీయే గెలిచింది.వైఎస్ ఆర్ చిత్తుచిత్తుగా ఓడిపోతా వుందన్నారు.ఇది కీలక సమయం అని 5 సంవత్సరాల నరకానికి ,సమస్యలకి కష్టాలకు చెక్ పెట్టె రోజూ మే 13వ తారీకు ,ఈరోజు నుంచి మీ ఉత్సహం రేట్టింపు కావాలి.వెలుగొండకి ఫౌండేషన్ వేసింది నేనే ..2014 లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో పశ్చిమ ప్రాంతానికి నీరు కావాలంటే వెలుగొండకు ఫౌండేషన్ వేసింది నేనే అని చంద్రబాబు అన్నారు.ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 15 లక్షల మందికి త్రాగు నీరు 4 లక్షల యాభై వేలకు పైగా ఎకరాలకు సాగు నీరు వచ్చేదని చంద్రబాబు తెలిపారు.వెలుగొండ ప్రాజెక్టు కోసం నేను అన్ని విధాల కష్టపడ్డానని ,డబ్బులకు కకృతి పడి వైసీపీ ప్రభుత్వం వెలుగొండను త్వరిత గతిన పూర్తి చేయలేదన్నారు.
నేను అధికారం లో ఉన్నప్పుడు 80%ప్రాజెక్టు పూర్తి చేసానని 20% ప్రాజెక్టు పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి మూడు రాజధానులు నిర్మిస్తా అంటాడు అని జగన్ పై విరుచుకు పడ్డారు.3 ముక్కలాట ఆడి అసలు రాజధానినే లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అని విమర్శించారు.పూర్తి కానీ ప్రాజెక్టు R&R ఇవ్వని ప్రాజెక్ట్ ని ఎవరైనా ఇనగారేట్ చేస్తారా అంటూ మండిపడ్డారు.ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ,నేనే నీళ్లు ఇస్తా ,నేను మీ సమస్య పరిష్కారం చేస్తా అంటూ చంద్రబాబు అన్నారు.ఎన్నికలు పూర్తయి ఎన్డీయే ప్రభుత్వం అధికారం లోకి వస్తే మార్కాపురం జిల్లా చేస్తాం అని చంద్రబాబు తెలిపారు.
Read More..
TDP అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆ ఫైల్‌పైనే: చంద్రబాబు కీలక ప్రకటన