- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ రాజధానికి రూ. 16 వేల కోట్ల రుణం.. ముగిసిన కీలక ఘట్టం
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(AP Capital Amaravati) అభివృద్ధికి కీలక ఘట్టం ముగిసింది. రూ. 16 వేల కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకుతో పాటు ఏడీ బ్యాంకు ముందుకొచ్చాయి. ఈ మేరకు రెండు సంస్థలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఢిల్లీ(Delhi)లో జరిగిన సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర అధికారులు సుమారు 8 గంటల పాటు చర్చించారు. అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలు రూపొందించారు. దీంతో రాజధాని రుణ ఒప్పందంలో పురోగతి లభించింది. ఈ ఒప్పందానికి డిసెంబర్‌లో జరిగే బోర్డు సమావేశంలో ప్రపంచ బ్యాంకు(World Bank) ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం ఒప్పంద ప్రతాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల(Central and State Governments) అధికారులు, బ్యాంకు ప్రతినిథులు సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత రూ. 16 వేల కోట్ల రుణాల విడుదల ప్రక్రియ ప్రారంభంకానుంది. ప్రపంచ బ్యాకు, ఏడీబీ(World Bank, ADB) చెరో రూ. 8 వేల కోట్ల రుణాలను ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి అందజేయనున్నాయి.