- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP News : క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో మరో భారీ మోసం వెలుగు చూసింది. నంద్యాలలోని డోన్(Done)లో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డోన్ పట్టణానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి.. కేవ ఇండస్ట్రీస్ పేరుతో ఆన్లైన్ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాడు. అయితే క్రిప్టో కరెన్సీ(Crypto currency)లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని స్థానికులకు ఆశ చూపడంతో అనేకమంది రామాంజనేయులును నమ్మి డబ్బు ముట్టజెప్పారు. లాభాలు వస్తాయనే ఆశతో అప్పులు చేసి, స్థలాలు అమ్మి మరీ భారీగా డబ్బులు పెట్టారు. కాగా గత కొంతకాలంగా రామాంజనేయులు ఫోన్ ఎత్తక పోవడంతో అనుమానం వచ్చి చూస్తే ఆఫీసుకు తాళం వేసి ఉంది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆందోళన చేపట్టారు. దాదాపు 200 మందికి పైగా బాధితులు రూ. 40 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్టు పోలీసులు తెలియ జేశారు.
- Tags
- crypto currency