Visakha: పుట్టిన రోజు వేళ తీవ్ర విషాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెత్

by srinivas |
Visakha: పుట్టిన రోజు వేళ తీవ్ర విషాదం..  ఇద్దరు యువకులు స్పాట్ డెత్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ అవుట్ గేట్ సమీపంలో బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మిరియాల అభిషేక్, జాన్సన్ మనోహర్‌గా గుర్తించారు. విశాఖ బీచ్‌లో జాన్సన్ మనోహర్ పుట్టిన రోజు వేడుక చేసుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుల మృతితో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టిన రోజునే మనోహర్ మృతి చెందండంతో స్థానిక ప్రజలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఎంతో ఉత్సాహంగా కనిపించే యువకులు ఇక లేరని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Next Story