- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Vizag: బోటులో అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 8 మంది
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం(Visakhapatnam)లోని నడి సముద్రంలో అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. సముద్ర మార్గం గుండా వెళ్తున్న ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బోటులో మొత్తం 8 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు కారణంగా నడి సముద్రంలో కాలుతున్న బోటులో 8 మంది సిబ్బంది చిక్కుకున్నారు. కాగా మంటలను గమనించిన సిబ్బంది సమీపంలో ఉన్న బోట్లకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇతర బోట్ల సిబ్బంది.. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చేపల వేటకు వెళ్లిన బోటులో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Advertisement
Next Story