విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో బ్లాస్ట్.. ఒకరికి తీవ్ర గాయాలు

by srinivas |
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో బ్లాస్ట్.. ఒకరికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌(Visakha Steel Plant) ఎస్‌ఎంఎస్‌-1లో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. ఎల్‌పీ‌బే స్టీల్‌ ల్యాడిల్‌ బ్లాస్ట్‌ కావడంతో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదంలో షిఫ్ట్‌ ఇన్‌ఛార్జ్‌ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ప్లాంట్ ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్లాంట్‌లోని యంత్రాలు, ఉత్పత్తికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. గాయపడిన మల్లేశ్వరరావుకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను సూచించామని చెప్పారు.

అయితే ఈ ఘటనతో స్టీల్‌ప్లాంట్‌లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కార్మికులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ఇటీవల కాలంలోనూ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సేఫ్టీ పద్ధతులు సరిగా పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. భారీగా ఉక్కు ఉత్పత్తి చేసే కంపెనీ కావడంతో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కార్మికులు కోరారు.

Next Story

Most Viewed