- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: ఏపీలో మడత రాజకీయం.. నేతల మధ్య డైలాగ్ వార్
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ డైలాగ్ లు చెప్పడం ట్రెండ్ గా మారింది. ఒకప్పుడు పార్టీ ప్రచారం లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి గురించి చెప్పే వాళ్ళు.. అలానే ఇంత పార్టీలపై విమర్శలు చేసే వాళ్ళు. అయితే అదంతా ఒకప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది.
ప్రజలను ఆకర్షించేందుకు సినిమా పేర్లు, డైలాగులు చెప్తున్నారు ప్రస్తుతం పార్టీ అధినేతలు, నేతలు. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ప్రచారంలో ప్రసంగిస్తూ ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అని ఆయన చెప్పిన డైలాగ్ ఏపీలో రాజకీయాలను హీటెక్కించ్చింది. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.
ముళ్ళును ముళ్ళుతొనే తియ్యాలి అన్నట్టు డైలాగ్ కి డైలాగ్ తో సంధానం చెప్తున్నారు. సీఎం జగన్ చొక్కా మడత పెట్టాల్సిన సమయం వచ్చింది అనే డైలాగ్ కి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. నువ్వు నీ వైసీపీ కార్యకర్తలు చొక్కా చేతులు మడత పెడితే, టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు అని..అందరూ కుర్చీలు మడతపెడితే ఏమవుతుందో తెలుసా జగన్ రెడ్డి నీకు కుర్చీ లేకుండా పోతుంది అని పేర్కొన్నారు.
ప్రజలకు కిక్ ఇచ్చేలా మాట్లాడంలో నాయకులు కేర్ తీసుకుంటున్నారు. ఇందులో సీఎం జగన్ ముందున్నారు. ప్రజలు అర్ధమైయ్యేలా చేప్పేందుకు సినిమాలను, డైలాగ్ లను వాడుతున్నారు. సీఎం జగన్ చంద్రముఖీ సినిమాను పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇక చంద్రబాబును చంద్రముఖీతో పోలుస్తూ.. చంద్రబాబుకి ఓటు వెయ్యడం అంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ తగలించుకోవడమే అని పేర్కొన్నారు.
కాగా జగన్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో జట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ఇక నారా లోకేష్ కూడా ఏ మాత్రం తాగడం లేదు. యువగలం, శంఖారావం వంటి కార్యక్రమాలతో ప్రజల మధ్యకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న నారా లోకేష్ కూడా కుర్చీ మడత పెట్టి అనే డైలోగ్ ను అలానే, తన మామ బాలయ్య డైలాగ్ లను అవలీలగా వాడుతున్నారు. ఏదేమైనా వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారేలా నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.