తిరుమలలో భక్తుడికి హార్ట్ ఎటాక్

by srinivas |   ( Updated:2024-08-22 05:03:32.0  )
తిరుమలలో భక్తుడికి హార్ట్ ఎటాక్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుడికి హార్ట్ ఎటాక్ వచ్చింది. తిరుపతి మెట్ల దారిలో నడుస్తూ ఒక్కసారిగా భక్తుడు కుప్పకూలారు. అయితే ఆయనకు తోటి భక్తులు సీపీఆర్ చేశారు. ఈ మేరకు లేచి కూర్చున్నారు. సెకన్ల వ్యవధిలోనే మళ్లీ కుప్పకూలిపోయి మృతి చెందారు. దీంతో భక్తుడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు భక్తుడి మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలుసుకుని బంధువులకు సమాచారం అందజేశారు. పోస్టుమార్టం తర్వాత భక్తుడి మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed