Viveka murder case: దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

by srinivas |   ( Updated:2024-03-11 14:46:44.0  )
Viveka murder case: దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. తెలంగాణ హైకోర్టు షరతులు కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టులో దేవిరెడ్డి తరపున పిటిషన్ దాఖలు అయింది.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. దేవిరెడ్డి శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచివెళ్లొద్దని, ప్రతి సోమవారం పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలకానున్నారు.

కాగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి దేవిరెడ్డి శంకర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. వైఎస్సార్ సీపీ ప్రధాన రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు. వివేకాహత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి సైతం నిందితుడిగా ఉన్నారు. అయితే ఇదే కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి కూడా నిందితుడిగా ఉన్నారు. ఆయన అప్రూవర్‌గా మారారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. కస్టడీకి తీసుకుని విచారించారు. కేసు తెలంగాణకు బదిలీ కావడంతో దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.

Read More..

నిన్న పవన్.. ఈ రోజు చంద్రబాబుతో చర్చలు.. పొత్తులపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed