తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయంతో కంట్రోల్ రూమ్‌లో దాక్కున్న సెక్యూరిటీ గార్డ్

by Mahesh |
తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయంతో కంట్రోల్ రూమ్‌లో దాక్కున్న సెక్యూరిటీ గార్డ్
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు తిరుమల(Tirumala) లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ.. చిరుత(cheetah) సంచారం కలకలం రేపుతోంది. గతంలో ఇలానే మెట్లపై వెళ్తున్న భక్తులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన నాటి ప్రభుత్వం అటవిశాఖ అధికారులతో కలిసి ట్రాప్‌లను ఎర్పాటు చేసి దాదాపు నాలుగు చిరుతలను పట్టుకొని దట్టమైన అడవిలో వదిలి పెట్టారు. తాజాగా తిరుమల తిరుపతిలోని శ్రీవారి మెట్టు(Shrivari Mettu) దగ్గర చిరుత సంచరించడం కలకలం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి కంట్రోల్ రూమ్ దగ్గరకు చిరుత రావడం గమనించిన సెక్యూరిటీ గార్డ్ భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు. వెంటనే టీటీడీ(TTD), అటవీశాఖ అధికారులు(Forest officials) సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనపై అటవి, టీటీడీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

Next Story