- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్ద పులి ఎటాక్.. నెల్లూరు-ముంబై హైవేపై కారు ప్రమాదం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై కారు ప్రమాదం జరిగింది. కదిరినాయుడిపల్లి సమీపంలో అతివేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న దిమ్మెను కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో కీలక ట్విస్ట్ ఎదురైంది. కారు ప్రమాదానికి పెద్ద పులి కారణమని డ్రైవర్ చెప్పారు. కారుపై పెద్దపులి ఎటాక్ చేయబోయిందని, దాన్ని తప్పించబోయి దీమ్మెను ఢీకొట్టినట్లు తెలిపారు. అయితే పెద్దపులి గురించి డ్రైవర్ చెప్పడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలు ఆ ప్రాంతంలోనే పులులు లేవని అటు అటవీశాఖ సిబ్బంది చెబుతోంది. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పరిసర ప్రజల్లో టెన్షన్ నెలకొంది. నిజంగా పులి ఉంటే ఎప్పుడు తమపై దాడి చేస్తోందోనని భయాందోళ చెందుతున్నారు. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి పెద్ద పులి ఉంటే బంధించేందుకు ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు.
Advertisement
Next Story