- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: విశాఖ జిల్లా కీలక నేతకు సీఎంవో నుంచి పిలుపు
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఇంచార్జుల నియామకంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంచార్జులను మార్చారు. అభ్యర్థుల బలాబలాలను పరిశీలించి ఇప్పటికే 6 జాబితాలు విడుదల చేశారు. తాజాగా ఏడో జాబితా విడుదల చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు చెందిన నేతకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది.. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కోలా గురువులుకు తాడేపల్లిలోని సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లింది. వెంటనే సీఎంవో కు రావాలని సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
కాగా కోలా గురువులు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆయన ఓడిపోయారు. గతంలో 2014లో విశాఖ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ సమయంలోనూ ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో కోలా గురువులుకు సీఎం జగన్ సీటు నిరాకరించారు. అయితే కొంతకాలంగా ఆయన అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎంవో నుంచి ఫోన్ రావడంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.