- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics:వైసీపీకి బిగ్ షాక్.. రేపు టీడీపీలో చేరనున్న పార్టీ కీలక నేతలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఆ పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలు ఇప్పటికే పార్టీని వీడి అధికార టీడీపీలో చేరారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల వైసీపీని వీడిన ఇద్దరు కీలక నేతలు టీడీపీ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం అయింది. 2019 డిసెంబర్‌లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. కానీ ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో మళ్లీ టీడీపీలోకి యూటర్న్ ఇస్తున్నారు. రేపు(బుధవారం) టీడీపీలో మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ రావు చేరబోతున్నట్లు సమాచారం. ఆగస్టు 29వ తేదీన వైసీపీ, రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ మరియు బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీకి రాజీనామా చేసిన ఈ ఇద్దరు కీలక నేతలు రేపు టీడీపీలో చేరబోతున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు కండువా కప్పుకోనున్నారు.