పోలవరం ప్రాజెక్ట్ కార్మికులకు ఫుడ్ పాయిజన్.. 88 మందికి అస్వస్థత ఐదుగురి పరిస్థితి విషమం

by Javid Pasha |   ( Updated:2023-02-11 10:25:37.0  )
పోలవరం ప్రాజెక్ట్ కార్మికులకు ఫుడ్ పాయిజన్.. 88 మందికి అస్వస్థత ఐదుగురి పరిస్థితి విషమం
X

దిశ, ఉమ్మడి ప.గో బ్యూరో : పోలవరం ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న 88 మంది ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు కార్మికులను ప్రాజెక్ట్ వాహనాలలో పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి మెగా కంపెనీ నిర్వహిస్తున్న మెస్ లో భోజనం చేసినట్లు కార్మికులు తెలుపుతున్నారు. మెస్ లో వంకాయ కూర తిన్న తర్వాత నుంచి ఆరోగ్యంలో మార్పులు వచ్చినట్లు అలాగే ఉదయాన్నే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వీరులో 83 మంది కార్మికులకు వైద్యం అందించగా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో అధికారులు పోలవరం ప్రాజెక్టు నివాసాలకు తరలించారు.5గురు కార్మికుల ఆరోగ్య పరిస్థితులు విస్మించడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. డిఎస్పి లతా కుమారి. తాసిల్దార్ ఘటనా స్థలానికి చేరుకొని సమీక్షిస్తున్నారు.

Advertisement

Next Story