- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
78 Independence Day: విజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: 78 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. విజయవాడలో జరుగుతున్న పంద్రాగస్టు వేడుకల్లో మంత్రులతో పాటు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు.
ఇప్పటికే ఢిల్లీ ఎర్రకోటలో ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇక దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లలో జాతీయ జెండాను ఆవిష్కరించి ‘జన గణ మన’ గీతాన్ని ఆలపిస్తున్నారు. ఈ వేడుకల్లో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. దేశ సమైక్యతను చాటుతున్నారు.