- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోటల్స్‌పై 62 కేసులు నమోదు.. రూ.39 లక్షల ఫైన్
దిశ, ఉత్తరాంధ్ర : విశాఖ జిల్లాలో ఫుడ్ ఔట్ లెట్స్ బాగా పెరిగాయని, ఎడిబులే ఐటమ్స్ వాడకం పెరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ కే.ఎస్. విశ్వనాథన్ అన్నారు. ఆయన కలెక్టరేట్‌లో తన ఛాంబర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం సరఫరా చేసిన టీపీసీ మీటర్స్ ద్వారా హోటల్స్‌లో ఆయిల్ తనిఖీలు జరుగుతున్నాయి అని తెలిపారు. ఆహార శాంపుల్స్ ల్యాబ్‌కి పంపుతున్నామన్నారు. కొంత మంది వెజ్ అని చెప్పి నాన్ వెజ్ వంటకాలు అమ్ముతున్నారు అని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ జిల్లాలో 62 కేసులు నమోదు ద్వారా రూ.39 లక్షలు జరిమానా విధించారు అని తెలిపారు.
సాధారణంగా ఆయిల్‌లో టేపీసి 25 లోపు వుండాలి, కానీ కొన్ని హోటళ్లలో 30 నుంచి 39 వరకు రీడింగ్ గుర్తించామన్నారు. ఈ నూనెతో చేసిన ఆహారం ఆరోగ్యానికి హానికరమని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన కేఎఫ్‌సీ(ద్వారకా నగర్ )కి రూ.2 లక్షలు జరిమానా విధించామన్నారు. అలాగే, హోటల్ మేఘాలయ, ప్యారడైజ్, ఆలిష్, ఇన్విటేషన్ 365, శ్యామల డ్రై ఫ్రూట్, రిలయన్స్ ఫ్రెష్ (చిన వాల్తేరు), నాయుడు కుండ బిర్యానీ, నేషన్స్ రెస్టారెంట్లకి జరిమానాలు విదించామని తెలిపారు. ప్రజలు ఎక్కడైనా ఆహారం బాగోకున్నా, కల్తి అని అనుమానం వున్నా సరే ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేయండి అని కోరారు. మీడియా సమావేశంలో ఆహార భద్రత శాఖ సహాయ అధికారి నందాజీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ జీ. వీ. అప్పారావు పాల్గొన్నారు.