- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2019లో గెలవకపోవడమే మంచిదైంది.. మాజీ వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేయలేదని చాలా మంది రాజకీయ నేతల్లో పార్టీలకు అతీతంగా ఉంది. పప్పు, బెల్లం మాదిరిగా ప్రజలకు డబ్బులు పంచడంపై ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగా విమర్శలు చేశారు. అయితే అభివృద్ధిపై వైసీపీ మాజీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుపై ఓడిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి స్థబ్ధుగా ఉన్నారు. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ నుంచి గెలవకపోవడం మంచిదైందని చెప్పారు. ఎందుకంటే అభివృద్ధిపై ప్రజలను తాను సమాధానం చెప్పలేకపోయేవాడినని తెలిపారు. గెలిచి ఉంటే ప్రజలు తనను నిలదీసేవాళ్లని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహించిన పర్చూరు నియోజకవర్గంలో ఏ ఒక్క రోడ్డు కూడా మరమ్మతుకు నోచుకోలేదని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఆ రోడ్లపై ఇంత ప్రశాంతంగా తిరిగేవాడిని కాదన్నారు. దేవుడి దయ వల్ల పర్చూరులో తాను గెలవకపోవడం మంచిదైందని చెప్పారు. తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇస్తామన్నారని, సీఎం జగన్ పెట్టిన నిబంధనలకు తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాలపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించడంలేదని మండిపడ్డారు.