గోదావరి నుంచి 1.43 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

by Jakkula Mamatha |
గోదావరి నుంచి 1.43 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
X

దిశ ప్రతినిధి,కాకినాడ:ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు సీలేరు నీరు తోడవటంతో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం క్రమేపీ పెరుగుతుంది. గత మూడు రోజులుగా నిలకడగా ఉన్న నీటి మట్టం గురువారం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీలోని ధవళేశ్వరం, మద్దూరు, ర్యాలీ, విజ్జేశ్వరం ఆర్మ్‌లలో గేట్లను ఎత్తటం ద్వారా మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. గోదావరిలోకి పై నుంచి వచ్చే ఇన్ ప్లో 1.53లక్షల క్యూసెక్కులు కాగా, అవుట్ ప్లో 1.43లక్షల క్యూసెక్కులు ఉంది. పంట కాలువలు ద్వారా 8,700క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story