- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హమ్మయ్య కాస్త నెమ్మదించింది..కరోనా @164
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కాస్త నెమ్మదించింది. గత వారం రోజులుగా ఏపీలో కరోనా విజృంభించింది. పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులను పెంచుకుంటూ పోయింది. గత శని వారానికి కేవలం 23 కేసులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ సరిగ్గా వారం రోజులు గడిచేసరికి 164 కరోనా పాజిటివ్ కేసులతో దేశంలోని అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల సరసన చేరింది.
నిన్న మద్యాహ్నానికి 161 కేసులతో తన ఉనికిని ఘనంగా చాటిన కరోనా నేటి ఉదయానికి కాస్త నెమ్మదించింది. కేవలం మూడు కరనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 140 కేసులు ఢిల్లీలోని ముజాహిదీన్‌లోని తబ్లిగి జమాత్ మర్కజ్‌లో కార్యక్రమాలకు హాజరైన వారివే కావడం విశేషం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమానికి హాజరైన వారు, వారి కుటుంబ సభ్యులను కరోనా పరీక్షలు స్వచ్ఛందంగా చేయించుకోవాలని పిలుపునిచ్చింది.
కాగా, ఈ 164 కరోనా కేసుల్లో అత్యధికంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన 32 మందికి నమోదయ్యాయి. ఏపీలో తొలి కేసు కూడా ఈ జిల్లాలోనే నమోదు కావడం విశేషం. నిన్న నమోదైన15 పాజిటివ్ కేసులు కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వారివేనని అధికారులు వెల్లడించడం కొసమెరుపు.
కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపాలిటీలు ఈ ప్రాంతాలను హైపోక్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేస్తున్నారు. మరోవైపు కరోనా సోకిన వారితో సంబంధాలు నెరపిన ప్రతి ఒక్కరినీ హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. వారిపై పోలీసు, వైద్యఆరోగ్య, వలంటీర్లతో నిఘా ఉంచారు.
Tags: corona virus, covid-19, andhrapradesh, vijayawada, health department