కరోనాతో నా కెరీర్ ముగిసిపోవద్దు : అండర్సన్

by Shyam |
కరోనాతో నా కెరీర్ ముగిసిపోవద్దు : అండర్సన్
X

కరోనా మహమ్మారి కారణంగా ఐసీసీ సహా పలు క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ పర్యటనలను రద్దు చేసుకున్నాయి. ఆ సిరీస్‌లు జరుగుతాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంపై టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్ భావోద్వేగంతో స్పందించాడు. ‘వచ్చే జులై నాటికి నాకు 38 ఏండ్లు వస్తాయి. ఇంకా నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడగలననే అనుకుంటున్నానని’ అన్నాడు. కాగా వెస్టిండీస్, పాకిస్తాన్ జట్ల నడుమ జరిగే సిరీస్ తర్వాత అండర్సన్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడనే ఊహాగానాల మధ్య అతను తన కెరీర్‌పై ఒక స్పష్టతనిచ్చాడు.

భవిష్యత్‌లో క్రికెట్ ఆడలేనని నేను అనుకోవట్లేదు.. మా జట్టు త్వరలోనే క్రికెట్ ఆడుతుంది. అలాగే నేను కూడా టెస్టు క్రికెట్ ఆడతాను.. కరోనా కారణంగా నా కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవాలని నేను కోరుకోవట్లేదని జిమ్మీ అన్నాడు. ‘ప్రస్తుతం ప్రపంచం ఒక విపత్తును ఎదుర్కొంటోంది. దాని గురించే ఆలోచిస్తున్నాను తప్ప భవిష్యత్‌లో క్రికెట్ ఆడగలనా లేదా అనే విషయంపై దృష్టిపెట్టలేదని’ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని తన ఇంట్లో ఉన్న జేమ్స్ అండర్సన్ తన టీమ్ మేట్స్‌కు సైక్లింగ్ చాలెంజెస్ విసురుతూ గడుపుతున్నాడు.

Tags: ICC, Test Series, Anderson, England bowler, Corona, Eng vs West Ind

Advertisement

Next Story