- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'చాయ్‌వాలా కూతురైన నేను ఫ్లైయింగ్ ఆఫీసర్నయ్యాను'
దిశ, వెబ్ డెస్క్: మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడు.. కాకపోతే దానికి కార్యదీక్ష సక్రమంగా ఉండాలే తప్ప.. దానికి ఏదీ కూడా అడ్డురాదని నిరూపించింది అంచల్ అనే యువతి. అంతేకాదు ఇప్పుడా ఆ యువతి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని మూనిచ్ జిల్లాకు చెందిన సురేశ్ గాంగ్వాల్ అనే వ్యక్తి బస్టాండ్ వద్ద చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆయనకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు అంచల్. అయితే ఈ యువతి పట్టుదలతో చదివి భారత వైమానిక దళంలో ఫ్లైయింగ్ ఆఫీసర్ గా చేరింది. ఈ సందర్భంలో చదువుకోవడానికి ఫీజు కట్టలేని పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ, ఆ యువతి ఏనాడు ధైర్యం కోల్పోలేదు. పలుసార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. అయినా వెనుకడుగు వేయలేదు. చివరికి ఆరో ప్రయత్నంలో విజయం సాధించింది. ఈ విషయమై ఆమెను అడుగగా 2013లో ఉత్తరాఖండ్ లోని కేథార్ నాథ్ లో వరదలు సంభవించినప్పుడు వైమానికి దళానికి చెందిన బలగాలు చేపట్టిన సహాయక చర్యలను చూసి స్ఫూర్తి పోందానని, తాను కూడా వైమానిక దళంలో చేరాలని ఆమె నిర్ణయించుకున్నట్లు అంచల్ చెప్పింది. ప్రస్తుతం ఈ యువతిని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నారు.