గర్భిణులకు రంగమ్మత్త కిట్స్

by Jakkula Samataha |
గర్భిణులకు రంగమ్మత్త కిట్స్
X

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఈ రోజు (మే 15న) పుట్టినరోజు జరుపుకుంది. అయితే ఈ పుట్టినరోజును మాత్రం జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్తోంది. అంతేకాదు ఈ బర్త్‌డే ఎప్పటికీ బెస్ట్ అని అంటోంది. కారణమేంటంటే.. తన జన్మదినం సందర్భంగా ఈ రంగమ్మత్త సేవాకార్యక్రమాల్లో పాల్గొనడమే.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో..

రాచకొండ పోలీసులు గర్భిణులు, పుట్టబోయే బిడ్డల రక్షణను దృష్టిలో ఉంచుకుని న్యూట్రిషన్ కిట్స్ అందించి.. వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. జవహర్ నగర్, యాచారం, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం ప్రారంభించారు కూడా. ఇందులో భాగంగా అనసూయ శుక్రవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని గర్భిణులకు హెల్ప్ చేశారు. కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 100 మంది ప్రెగ్నెంట్ లేడీస్‌కు న్యూట్రిషన్ కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ పాల్గొన్నారు.

కాగా అనసూయ చేసిన ఈ సహాయానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఉన్న దాంట్లో ఎంతో కొంత సాయం చేయాలన్న రంగమ్మత్త ఆలోచనను అభినందిస్తున్నారు.

Advertisement

Next Story