ఆనందయ్య మందు హానికరం కాదు : ఆయూష్ కమిషనర్

by srinivas |
anandaiah medicine
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ నివారణ కోసం ఏపీలోని నెల్లూరు జిల్లాకు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందును తయారీ చేసిన విషయం తెలిసిందే. దీనికోసం జనాలు ఎగబడుతుండగా, ఏపీ ప్రభుత్వంతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్ని పరీక్షలు నిర్వహించి హానికరం కాదు, కొవిడ్ నివారణకు పనికొస్తుందనే తేల్చాకే ఈ మందును పంపిణీ చేయాలని ఆదేశించారు.ఈ క్రమంలోనే ఆనందయ్య పసరు మందును అటు ఐసీఎంఆర్, ఆయూష్ నిపుణులు పరీక్షించనున్నారు. ముందు ఆయూష్ విభాగం వారు పరీక్షించగా ఇందులో హానికరమైన పదార్థాలు ఏమీ లేని ఆయూష్ కమిషనర్ రాములు వెల్లడించారు.

తమ ముందు ఆనందయ్య పసరు మందును తయారు చేశాడని, ఆ సమయంలో అందులో ఎలాంటి హానికర పదార్థాలు వినియోగించలేదన్నారు.అయితే, ఆనందయ్య మందును మాత్రం నాటు మందుగానే పరిగణిస్తామని రాములు చెప్పారు. కళ్లల్లో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడారని, కానీ ఈ మందు కొవిడ్ రోగులపై పనిచేస్తుందా లేదా అనేది విజయవాడ-తిరుపతి ఆయుర్వేద వైద్యుల బృందం తేల్చుతుందని ఆయూష్ కమిషన్ స్పష్టంచేశారు.ఆనందయ్య మందుపై CCRASకు వైద్యుల బృందం నివేదిక పంపుతుందని వివరించారు. అన్ని నివేదికలు వచ్చాకే మందు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందన్నారు. ఇదిలాఉండగా, ఆనందయ్య మందును వేసుకోని రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. అదే విధంగా మరో ఇద్దరు రోగులు ఆనందయ్య పసరు మందును వాడి తాజాగా ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed