ఆరుగురు యువ క్రికెటర్లకు ఆనంద్ మహింద్రా కానుక

by Shyam |   ( Updated:2021-01-23 06:07:20.0  )
ఆరుగురు యువ క్రికెటర్లకు ఆనంద్ మహింద్రా కానుక
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన యువ క్రికెటర్లకు ఆనంద్ మహింద్ర బహుమతులు ప్రకటించారు. ఆరుగురు క్రికెటర్లకు మహింద్ర కార్లను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసిస్‌తో టెస్టు మ్యాచ్‌ల్లో శార్దూల్, సిరాజ్, శుభ్‌మన్ గిల్, సైనీ, వాషింగ్టన్ సుందర్, నటరాజన్‌ ఆటపై ప్రశంసలు కురిపించారు. చివరి టెస్టులో ఈ ఆరుగురు క్రికెటర్లు కీలక భాగస్వామ్యం నెలకొల్పి దేశానికి చారిత్రాత్మక విజయం అందించగా.. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed