- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భలే దండ.. పెళ్లికొచ్చినోళ్లంతా షాక్
దిశ, బోథ్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తున్నా.. కొందరు మాత్రం ఈ ముహూర్తాలు పోతే మళ్లీ ఎప్పుడు వస్తాయో అని చకచకా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో తక్కువమంది బంధువులతో లాక్‌డౌన్ రూల్స్ పాటిస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. అయితే.. ఎవరికైనా పెళ్లి వేడుకను ఘనంగా చేసుకోవాలని అనుకుంటారు. కానీ, పరిస్థితులు అనుకూలించక తప్పని పరిస్థితుల్లో ఎలాంటి హడావుడి లేకుండా నిరాడంబరంగా చేసుకుంటున్నారు.
కానీ, ఈ తరుణంలో కూడా కొందరు మాత్రం తక్కవమందితోనైనా వినూత్నంగా పెళ్లిళ్లు చేసుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. తాజాగా.. అలాంటి పెళ్లి వేడుకే ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. శనివారం బోథ్‌కి చెందిన సావిత్రి, శేఖర్‌ల కూతురుతో నర్సాపూర్‌కి చెందిన అబ్బాయికి ఇచ్చి బోథ్‌లోని సాయిబాబా ఆలయంలో జరిపించారు. ఇందులో వింత ఏమిటంటే.. కొందరు అబ్బాయికి సంబంధించిన స్నేహితులు వినూత్నంగా నవ దంపతులకు గిఫ్ట్‌గా మాస్కులతో దండ తయారు చేయించారు. దీనిని పెళ్లిలో వారికి గిఫ్ట్‌గా ఇచ్చి మాస్కులపై పెళ్లికి వచ్చిన బంధువులకు అవగాహన కలిగేలా చేశారు. దీంతో అందరూ అబ్బాయి స్నేహితులను శభాష్ అంటూ.. మెచ్చుకుంటున్నారు.