- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం.. అసలేం జరిగిందంటే ?
దిశ, కూకట్పల్లి: తన భార్యతో చాటింగ్ చేస్తున్నాడన్న కోపంతో యువకుడిని నిర్మానుశ్య ప్రాంతంలో ఓ వ్యక్తి రాడ్‌తో కొట్టి చంపిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్‌కు చెందిన శ్రీకాంత్(24), అదే కాలనీకి చెందిన సౌజన్య అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత ఆరు నెలలుగా సదరు మహిళతో ఫోన్లో మాట్లాడటం, చాటింగ్ చేయడం చేస్తు వచ్చాడు. విషయం తెలిసిన సౌజన్య భర్త శ్రీశేలం శ్రీకాంత్‌తో తన భార్యతో మాట్లాడవద్దు, చాటింగ్ చేయ వద్దని హెచ్చరించాడు. ఇదిలా ఉండగా ఈ నెల 1వ తేదిన ఇంటి నుంచి బయటికి వెళ్లిన శ్రీకాంత్ ఇంటికి రావక పోవడంతో 2వ తేదిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాంత్ కాల్ డేటా సేకరించిన పోలీసులకు శ్రీకాంత్ సౌజన్య అనే మహిళతో 6 నెలలుగా తరచు మాట్లాడటం, చాటింగ్ చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
ఇదిలా ఉండగా బుధవరం కేపీహెచ్‌బీకాలనీ 15 ఫేజ్‌లోని ఖాళీ స్థలంలో బురదలో ఓ యువకుడి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు వచ్చిన సమాచారం వచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా 2వ తేదిన మిస్సింగ్ కేసు నమోదైన శ్రీకాంత్‌గా గుర్తించారు. శ్రీకాంత్ శరీంపై రాడ్‌తో కొట్టిన గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా తన భార్య సౌజన్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో శ్రీశేలం శ్రీకాంత్‌ను 15 ఫేజ్‌లోని ఖాళీ మైదానం వద్దకు పిలిచి రాడ్‌తో కొట్టి చంపి, అక్కడే ఉన్న బురద గుంతలో పడేసి వెళ్లి పోయినట్టు పోలీసులు తెలిపారు.