బెజవాడలో కాల్పులు… కమిషనరేట్ ఉద్యోగి హతం

by srinivas |
బెజవాడలో కాల్పులు… కమిషనరేట్ ఉద్యోగి హతం
X

దిశ, వెబ్‌డెస్క్: బెజవాడలో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. దీంతో మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూటర్‌పైన వచ్చిన కొందరు దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపి హతమార్చి, పరారయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని, నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా మహేశ్ విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Next Story

Most Viewed