- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి..
దిశ న్యూస్ మద్దిరాల: మండలంలోని గోరంట్ల, కుంటపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి డి. రామారావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరూ వరి పంట కోసిన తర్వాత పొలాల్లో 17 శాతం తేమశాతం ఉండేటట్లు అరపెట్టాక దాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులు నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని శుభ్రపరుచుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలిపారు.
గత నాలుగు రోజుల నుండి కురుస్తున్నాయని, వర్షాలకు రైతులందరూ ధాన్యాన్ని పట్టాలతో కప్పి కాపాడుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సదుపాయాలు కల్పించాలని సంబంధిత కేంద్రాల సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు, సీఈఓ వెంకన్న, ఏఈఓ లు రాకేష్, అనూష, నిర్వాహకులు గణేష్, సంధ్య, రైతు బందు సమితి కోఆర్డినేటర్లు గోల్కొండ రవి, రైతులు బద్దం దేవేందర్ రెడ్డి, భయ్యా మల్లయ్య, వెంకన్న, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.