- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డుపై ధాన్యం పోసి ఆందోళనకు దిగిన రైతు దంపతులు
దిశ, మెదక్: ఆరుగాలం కష్టపడే అన్నదాతకు ధాన్యాన్ని విక్రయించుకోవడానికి కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంటోన్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా రైతుల వ్యవసాయ పొలాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు చేయాలనే నిబంధనలు పెట్టినా, ఐకేపీ సిబ్బంది మాత్రం ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజులు గడిచినా ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ, రైతు ధాన్యాన్ని రోడ్డుపై పోసి ఆందోళనకు దిగిన ఘటన మిరుదొడ్డి మండలంలో చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ గొంగళ్ల మల్లేశం అనే రైతు తన భార్యతో కలిసి ధాన్యాన్ని రోడ్డుపై పోసి, టెంటు వేసుకుని ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నెల రోజుల నుంచి గొడ్డు, గోదా, పెళ్ళాం పిల్లలను వదులుకొని కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. నెల రోజుల క్రితం వ్యవసాయ పొలం వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకుని గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చానని, నెల రోజులు గడుస్తున్నా తన ధాన్యాన్ని కొనడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి తన సీరియల్ నెంబర్ రాలేదంటూ ధాన్యాన్ని విక్రయించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తన కన్నా వెనుక వచ్చిన రైతులు, దళారుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన సిబ్బంది, తనని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయంపై ఐకేపీ సిబ్బందిని వివరణ కోరగా, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురాకముందే రైతు మల్లేశం టోకెన్ తీసుకొచ్చారని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత రైతుకు నూతన టోకెన్ ఇచ్చామని, టోకెన్ ప్రకారమే కొనుగోలు చేస్తామని చెప్పుకొచ్చారు.