కురచ దుస్తులు సరే.. ముందు నీ మైండ్‌సెంట్ సరిచేసుకో : హీరోయిన్

by Shyam |   ( Updated:2023-07-13 06:15:39.0  )
Amyra Dastur
X

దిశ, సినిమా: హీరోయిన్ అమైరా దస్తూర్ రీసెంట్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ పోస్ట్‌పై విమర్శలు ఎదుర్కొంది. బ్లూ షాట్, వైట్ టాప్‌ డ్రెస్‌లో హాట్‌గా కనిపిస్తూ హీల్స్‌పై ‘డోంట్ రష్ చాలెంజ్’ చేసిన అమైరా గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చినా.. కొందరు మాత్రం ట్రోల్ చేశారు. ‘పబ్లిక్‌గా ఇలాంటి దుస్తులు ధరించడం వల్లనే అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారు. నిజంగా ఇలాంటి పొట్టి పొట్టి దుస్తులు వేసుకోవాల్సిన అవసరం ఉందా?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ డిస్టర్బింగ్ కామెంట్ చదివిన అమైరా.. బేఫిట్టింగ్ రిప్లై ఇచ్చింది. ‘నీలాంటి మానసికస్థితి సరిగా లేని వారి వల్లే మహిళలు లైంగికంగా వేధించబడుతున్నారు. మహిళలు ఎలా డ్రెస్ వేసుకోవాలో క్లాస్‌లు ఇవ్వడం కాదు. వారిని ఎలా గౌరవించాలి? వారితో ఎలా ప్రవర్తించాలో పురుషులకు నేర్పించండి’ అని తెలిపింది. కాగా అమైరా ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ప్రశంసలు అందుతున్నాయి.

Advertisement

Next Story