- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలో విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్’
దిశ వెబ్ డెస్క్: లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. దాంతో సినీ రంగంపై కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఒక వేళ లాక్డౌన్ ఎత్తేసినా సినిమా షూటింగ్ లకు అనుమతి ఇప్పట్లో వచ్చే పరస్థితి కనిపించడం లేదు. దాంతో సినిమా పై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలకు తీవ్రంగా నష్టపోతున్నాయి.
చిన్ననిర్మాతలు, పెద్ద నిర్మాతలు అని కాకుండా అందరూ టెన్షన్ పడుతున్నారు. సెట్స్ మీదున్న సినిమా నిర్మాతలది ఓ సమస్య అయితే, విడుదలకు ముందు లాక్డౌన్ వల్ల రిలీజ్ ఆగిపోయిన సినీ నిర్మాతలది మరో సమస్య. లాక్డౌన్ ఎప్పుడూ ముగుస్తుందో, సినిమా విడుదల తేదీ ఎప్పుడు అనౌన్స్ చేయాలో క్లారిటీ ఉండకపోవడంతో అందరి నిర్మాతల్లోనూ టెన్షన్ ఉంది. దీంతో అందరూ వారి సినిమాలను డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేసుకోవాలని చూస్తున్నారు. అలా అయినా తమ సినిమాకు ఖర్చు చేసిన డబ్బులు వస్తాయని అందరూ అటువైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా ‘అమృతరామమ్’ అనే చిత్రం ఓటిటి ప్లాట్ ఫామ్‌లో డైరెక్ట్‌గా రిలీజవుతున్న మొదటి తెలుగు సినిమా కాబోతోంది.
సరికొత్త ప్రేమ కథాంశంతో రూపొందిన రొమాంటిక్ చిత్రం ‘అమృతరామమ్’ ఈనెల 29న జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌పై విడుదలవుతున్నట్లు చిత్ర నిర్మాత సి.ఎన్. రెడ్డి తెలిపారు. ఈ సినిమాను ఉగాది పండగ సందర్భంగా విడుదల చేయాలని మొదట్లో అనుకున్నా..కరోనా కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై వస్తున్న తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్’ అని దర్శకులు సురేందర్ అన్నారు. రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ లు ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఎన్.ఎస్. ప్రసు సంగీతం అందించగా, సంతోష్ షనోని డీఓపీగా వ్యవహరించారు. ప్రేమ కోసం పరితపించే అబ్బాయిల కథలను వెండితెరపై మనం చాలా చూశాం. అయితే, అదే ఒకమ్మాయి ఓ అబ్బాయిని విపరీతంగా ప్రేమిస్తే ఎలా ఉంటుదనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించారు. పద్మజ ఫిల్మ్స్ఇండియా ప్రై.లి., సినిమావాలా పతాకంలో ఈ సినిమాను నిర్మించారు. సి.ఎన్. రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
tags : z5 originals, ott, telugu cinema, amrutharamam,amitha ranganath, ram mittakanti