కొడుకు పేరు చెప్పిన అమృతా రావు..

by Shyam |
కొడుకు పేరు చెప్పిన అమృతా రావు..
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు..అతిథి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. వివాహ్, మై హూనా లాంటి సినిమాలతో హిందీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ..కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసి ఆర్జే అన్మోల్‌ను మ్యారేజ్ చేసుకుంది.

దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఇద్దరు 2016లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న అమృత ఈ మధ్యే.. తల్లి కాబోతుందని వార్తల్లో నిలిచింది. ఈ మధ్య బేబీ బాయ్‌ను ఆహ్వానించిన ఇద్దరు..తమ కొడుకుకు ఏ పేరు పెట్టాలో ఫాలోవర్స్, ఫ్యాన్స్‌ను అడిగి మరీ సలహా తీసుకున్నారు. వేల సంఖ్యలో అభిమానులు కొన్ని పేర్లను సజెస్ట్ చేయగా..వాటిలో ది బెస్ట్ చూజ్ చేసుకుని ఫైనల్ చేశారు. హలో వరల్డ్..మా కొడుకు ‘వీర్’ అంటూ బేబీ బాయ్‌ను పరిచయం చేసిన అమృత, అన్మోల్ బేబీకి సంబంధించిన బుజ్జి పిడికిలి ఫొటోను షేర్ చేశారు. తనను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు.

https://www.instagram.com/p/CHPGLjHjQiH/?igshid=1pcxpo52jt0jb

Advertisement

Next Story