- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సభపై సందిగ్ధం: అమరావతి రైతుల పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతిలో బహిరంగ సభకు అనుమతి కోరుతూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. సోమవారం రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్ విచారణకు హైకోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. అమరావతి రైతుల పిటిషన్‍పై బుధవారం విచారణ చేయనుంది. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారిని దర్శించుంకునేందుకు అమరావతి రైతులకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని సూచించింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న తుళ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభంకాగా ఈనెల 17న తిరుపతిలో బహిరంగ సభతో ఈ పాదయాత్ర ముగుస్తుంది. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ ఈ యాత్రను చేపట్టారు. హైకోర్టు అనుమతితో న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర చేపట్టారు. నవంబర్ ఒకటిన గుంటూరులో ప్రారంభమైన ఈ యాత్ర ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు మెుత్తం నాలుగు జిల్లాల్లో సాగింది. 400 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి పాదయాత్రకు రైతులు ముగింపు పలుకనున్న సంగతి తెలిసిందే.