వామన్ రావు మర్డర్ కేసులో అసలు సూత్రధారి ఆయనే..?

దిశ, వెబ్‌డెస్క్:మంథనికి చెందిన లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు ఒక్కో విషయాన్ని కూపీ లాగుతున్నారు. వామన్ రావును మర్డర్ కోసం మూడ్రోజుల ముందే పథక రచన జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరిన్ని సాక్ష్యాధారాల కోసం గుంజపడుగులో శుక్రవారం బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కుంటశ్రీను ఏ1, చిరంజీవి ఏ2, కుమార్ ఏ3 నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జెడ్పీచైర్మన్ పుట్టమధు మేనల్లుడు బిట్టుశ్రీను […]

Update: 2021-02-18 23:45 GMT

దిశ, వెబ్‌డెస్క్:మంథనికి చెందిన లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు ఒక్కో విషయాన్ని కూపీ లాగుతున్నారు. వామన్ రావును మర్డర్ కోసం మూడ్రోజుల ముందే పథక రచన జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరిన్ని సాక్ష్యాధారాల కోసం గుంజపడుగులో శుక్రవారం బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కుంటశ్రీను ఏ1, చిరంజీవి ఏ2, కుమార్ ఏ3 నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జెడ్పీచైర్మన్ పుట్టమధు మేనల్లుడు బిట్టుశ్రీను పేరు తెరపైకి వచ్చింది. వామన్ రావు హత్య జరగడానికి ముందు కుంట శ్రీను 25సార్లు అతనితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

అంతేకాకుండా, నేరం చేయడానికి అవసరమైన కారు, కత్తులను జెడ్పీచైర్మన్ మేనల్లుడే అందించాడని పోలీసులు నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం బిట్టు శ్రీను పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు. అంతకుముందు శివాలయం చైర్మన్ పదవిలో గత కొన్నేళ్లుగా వామన్ రావు బంధువు కొనసాగుతున్నారు. ఆ పదవికోసం కుంటశ్రీను, అదేవిధంగా అక్రమ క్వారీ వల్ల పుట్టమధు రూ.కోట్లు గడించాడని వామన్ రావు పలుమార్లు పిటిషన్స్ వేశాడు.ఈ రెండు ఘటనలతో పాటు మరిన్ని విషయాల్లో తమకు అడ్డొస్తున్నాడని భావించిన వీరు ఆయన్ను అడ్డుతొలగించుకోవాలని భావించినట్లు సమాచారం. తన మేనల్లుడి పేరు తెరమీదకు రావడంపై జెడ్పీ చైర్మన్ పుట్టమధు ఇంకా స్పందించలేదు. కాగా, నడిరోడ్డుపై లాయర్ దంపతుల హత్యపై అటు హైకోర్టుతో పాటు, ఇటు మానవ హక్కువ కమిషన్ సైతం సీరియన్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్షాలైతే ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే అని విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News