అక్రమ కట్టడాలను తొలగించండి
జమ్మికుంట పట్టణంలో అక్రమ కట్టడంపై జిల్లా కలెక్టర్ కి ప్రజావాణిలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చేల్పూరి రాము ఫిర్యాదు చేశారు.
దిశ, జమ్మికుంట టౌన్ : జమ్మికుంట పట్టణంలో అక్రమ కట్టడంపై జిల్లా కలెక్టర్ కి ప్రజావాణిలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చేల్పూరి రాము ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 28వ వార్డులోని ఎంప్లాయిస్ కాలనీలో ఓ ఇల్లు అక్రమంగా కట్టారని, దాంతో మున్సిపల్ ఆదాయానికి గండిపెడుతూ రాజకీయ నాయకుల అండదండలతో చేపట్టారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ నిబంధనలకు వ్యతి రేకంగా తన ఇష్టం వచ్చిన తీరుగా ఎలాంటి అనుమతులు లేకుండా పై అంతస్తు నిర్మించుకున్నారని తెలిపారు.