కాంగ్రెస్ నేతల ఇళ్ల చుట్టూ కారు నేతల ప్రదక్షిణలు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేటీఆర్ అనుచరుల భూ కబ్జా వ్యవహారంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేటీఆర్ అనుచరుల భూ కబ్జా వ్యవహారంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తుంది. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను రాబందుల్లా పిక్కుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం ఉందని సిరిసిల్లలో పెద్దఎత్తున ప్రభుత్వ భూములను కబ్జా చేసిన మాజీ ప్రజాప్రతినిధులు అక్రమంగా పట్టాలు పొంది గుట్టు చప్పుడు కాకుండా ఇతరులకు అమ్ముకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల అర్బన్ పరిధి మొదలుకుని జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న తంగళ్లపల్లి మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు వెలుగులోకి వస్తోంది. కేటీఆర్ అనుచరులు చేసిన భూబాగోతాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. ఇప్పటికే అక్రమంగా ప్రభుత్వ భూముల పట్టా చేసుకున్న కేసులో కొంతమంది బీఆర్ఎస్ అగ్ర నేతలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, మరి కొంతమంది కబ్జాకు పాల్పడిన కీలక నేతల అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. వారికి సహకరించిన రెవెన్యూ అధికారుల పై సైతం పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కబ్జాకు పాల్పడిన కారు పార్టీ నేతలు హస్తం పార్టీ అగ్రనేతల ఇండ్ల చుట్టూ రహస్య ప్రదక్షణలు చేస్తుండగా, మరికొందరు అప్స్కాండింగ్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ అనుచరులు రాబందుల్లా పిక్కుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం ఉందని సిరిసిల్లలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కబ్జా చేయగా ఇటీవల పలువురు కారు నేతలు అరెస్ట్ అయ్యారు. కాగా మాజీ ప్రజాప్రతినిధులు అక్రమంగా ప్రభుత్వ భూమికి పట్టా పొంది గుట్టు చప్పుడు కాకుండా ఇతరులకు అమ్ముకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల అర్బన్ పరిధి మొదలుకుని జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న తంగళ్లపల్లి మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు వెలుగులోకి వస్తోంది. కేటీఆర్ అనుచరులు చేసిన భూబాగోతాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. ఇప్పటికే అక్రమంగా ప్రభుత్వ భూముల పట్టా చేసుకున్న కేసులో కొంతమంది బీఆర్ఎస్ అగ్ర నేతలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, మరి కొంతమంది కబ్జాకు పాల్పడిన కీలక నేతల అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. వారికి సహకరించిన రెవెన్యూ అధికారుల పై సైతం పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కబ్జాకు పాల్పడిన కారు పార్టీ నేతలు హస్తం పార్టీ అగ్రనేతల ఇండ్ల చుట్టూ రహస్య ప్రదక్షణలు చేస్తుండగా, మరికొందరు అప్స్కాండింగ్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
తంగళ్లపల్లిలో భూ బకాసురులు..
గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అండదండలతో ఆయన అనుచరులు జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కాగా, సిరిసిల్ల అర్బన్ పరిధితో పాటు తంగళ్లపల్లి మండలంలో సుమారు వందల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. మండలంలో భూతగాదాలు, పంచాయతీలు, సెటిల్‌మెంట్లు చేసే మాజీ ప్రజాప్రతినిధులు ముగ్గురు మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని ఓ సర్వే నంబరులో గల ప్రభుత్వ భూమిని తలా రెండు ఎకరాల చొప్పున వారి సతీమణుల పేరుమీద అక్రమంగా పట్టా చేయించుకున్నట్లు తెలిసింది. ఇలా మండల వ్యాప్తంగా వందల ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు అక్రమంగా పట్టా పొంది కొన్నాళ్లకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎకరానికి రూ.8 లక్షలు..
అయితే బస్వాపూర్ గ్రామంలో తలా రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిని అక్రమ పట్టా చేసుకున్న ముగ్గురు ప్రజాప్రతినిధులు కొంతకాలం తర్వాత ఎకరానికి రూ.8 లక్షల చొప్పున 2 ఎకరాలకు రూ.16 లక్షలు, ఇలా తలా రెండు ఎకరాల భూమిని ఇతరులకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా వచ్చిన డబ్బుతో అధికారం ఉన్నన్ని రోజులు రాజభోగాలు అనుభవిస్తూ తిరిగారని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు. అమ్మిన వారికి మూడోసారి తమ పార్టీ అధికారంలోకి రాగానే పట్టా చేయిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ వారి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం భూ అక్రమాల పై దృష్టి సారించడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అమ్మినవారికి తిరిగి డబ్బులు ఇవ్వలేక, కబ్జా చేసిన భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని తర్జనభర్జన పడుతున్నారు.
మరి కొంతమంది అరెస్టుకు రంగం సిద్ధం ?
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం జిల్లాలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల చిట్టా బయటకు తీయడంలో నిమగ్నం అయింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు అక్రమ భూ కబ్జాదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో ఇద్దరు బీఆర్ఎస్ అగ్ర నేతలను, తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో మరో బీఆర్ఎస్ కీలక నేతను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన మరి కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగ సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అక్రమ పట్టాలకు సహకరించిన రెవెన్యూ అధికారులపై సైతం పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
హస్తం అగ్ర నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షణలు...
ఇదిలా ఉండగా సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతల వరుస అరెస్టులకు పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో తమ వంతు ఎప్పుడోనని కబ్జాకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వారు కాంగ్రెస్ అగ్రనేతల ఇండ్ల చుట్టూ రహస్య ప్రదక్షణలు చేస్తున్నట్లు సమాచారం. రహస్యంగా కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ అవుతూ అరెస్టుల నుంచి తమను కాపాడాలని, అవసరమైతే పార్టీ మారడానికి కూడా సిద్ధమని వేడుకుంటున్నట్లు తెలిసింది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు ససేమీరా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. కాగా మరికొంతమంది నేతలు మకాం మార్చి అప్‌స్కాండింగ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.