ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు..

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ వ్యక్తికి సంబంధించిన ద్విచక్ర వాహనం చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించామని ఎస్సై రమాకాంత్ తెలిపారు.

Update: 2024-12-22 09:16 GMT

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ వ్యక్తికి సంబంధించిన ద్విచక్ర వాహనం చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించామని ఎస్సై రమాకాంత్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన దాసరి అజయ్ కుమార్ అనే వ్యక్తి ఈనెల 17వ తారీఖున గొల్లపల్లి బస్టాండ్ లో ఇంటి నిర్మాణం వద్ద తన పల్సర్ వాహనాన్ని పార్కు చేసి ఉంచగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు దర్యాప్తులో భాగంగా శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఎల్లారెడ్డిపేట రెండో బైపాస్ లో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన ముద్ర కోలా శ్రీకాంత్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా పల్సర్ వాహనాన్ని దొంగతనం చేసి కామారెడ్డి పట్టణానికి చెందిన టాక్ అర్జున్ సింగ్ అనే వ్యక్తి వద్ద వాహనాన్ని అమ్మకం కోసం పెట్టాడని పేర్కొన్నాడు. వీరి ఇద్దరి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారని ఎస్సై తెలిపారు.


Similar News