ప్రజల శ్రేయస్సే పోలీస్ శాఖ లక్ష్యం

ప్రజల శ్రేయస్సే పోలీస్ శాఖ లక్ష్యం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

Update: 2024-12-23 10:32 GMT

దిశ,గంభీరావుపేట : ప్రజల శ్రేయస్సే పోలీస్ శాఖ లక్ష్యం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం లింగాన్నపేట గ్రామం (ఎర్రషేలక తండా)లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అశ్వినీ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి సత్వరమే వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

     కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. అందులో భాగంగా గతంలో వీర్నపల్లి, రుద్రంగి మండల పరిధిలోని వివిధ గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్స్ ,ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గంజాయికి అలవాటు పడిన వారి వివరాలు అందించాలని కోరారు. అశ్విని హాస్పిటల్ వైద్య బృందానికి జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కంటి, దంత, గైనకాలజిస్ట్, న్యూరో, జనరల్ ఫిజీషియన్ , జనరల్ సర్జన్ ,అర్థోపెడిక్, పిల్లల వైద్య నిపుణులు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ శ్రీకాంత్, వైద్య నిపుణులు, గ్రామ ప్రజలు , సిబ్బంది పాల్గొన్నారు.


Similar News