దిశ ఎఫెక్ట్...రైతుకు నోటీసులు జారీ

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామ శివారులో చెరువు భూమి కబ్జాకు గురవుతుందని దిశ పత్రికలో ఆదివారం వార్త ప్రచురితం కాగా విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఈ సత్యనారాయణ, ఏఈ భాస్కర్ రెడ్డి కి ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-12-23 10:41 GMT

దిశ, ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామ శివారులో చెరువు భూమి కబ్జాకు గురవుతుందని దిశ పత్రికలో ఆదివారం వార్త ప్రచురితం కాగా విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఈ సత్యనారాయణ, ఏఈ భాస్కర్ రెడ్డి కి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రైతు ట్రాక్టర్ సహాయంతో చదును చేసిన భూమి ఎఫ్ టీఎల్ పరిధిలోకి వస్తుందని, దీనివల్ల చెరువులోని నీటి సామర్థ్యం తగ్గిపోతుందని, వెంటనే మర్రి దేవారెడ్డిని అట్టి పనులను నిలిపివేయాలని, లేని యెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాంతో సదరు రైతు ఆ పనులను నిలిపివేశారు. ఎవరైనా పర్మీషన్ లేకుండా చెరువు భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Similar News