దిశ ఎఫెక్ట్​...ప్రమాదకర ట్రాన్స్ ఫార్మర్ తొలగించేందుకు చర్యలు

జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాల వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Update: 2024-12-23 10:05 GMT

దిశ, తంగళ్లపల్లి : జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాల వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.. ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్.. అనే దిశ కథనానికి స్పందించిన అధికారులు పాఠశాల వద్ద ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించిన విషయం తెలిసిందే. దాంతో సోమవారం దానిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. ట్రాన్స్ ఫార్మర్ కు అమర్చిన విద్యుత్ తీగలను తొలగిస్తున్నారు. దాంతో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Similar News