ఎమ్మెల్సీ కవితపై చేసిన మాటలు వెనక్కి తీసుకో : పుట్ట మధు
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన కామెంట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. ఆదివారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ ప్రస్థానంలో తనవంతు బాధ్యతలు నిర్వర్తించిన కవితపై రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. సమస్యల పట్ల స్పందిచే విధానం గమనించే టీబీజీకేఎస్ నాయకులు కవితను గౌరవ అధ్యక్షురాలిగా ఉండాలని కోరారన్నారు. ఆమె కార్మిక క్షేత్ర […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన కామెంట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. ఆదివారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ ప్రస్థానంలో తనవంతు బాధ్యతలు నిర్వర్తించిన కవితపై రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
సమస్యల పట్ల స్పందిచే విధానం గమనించే టీబీజీకేఎస్ నాయకులు కవితను గౌరవ అధ్యక్షురాలిగా ఉండాలని కోరారన్నారు. ఆమె కార్మిక క్షేత్ర సంఘాలను కైవసం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని రాజేందర్ ఆరోపించడం అభ్యంతరకరమన్నారు. అదేవిధంగా ఎంపీ సంతోష్ కుమార్‌పై కూడా ఈటల అసంబద్ధంగా వ్యాఖ్యానించారని పుట్ట మధు విమర్శించారు. రాజేందర్ తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పాల్సింది పోయి లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఈసమావేశంలో భూపాలపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిణి కూడా పాల్గొన్నారు.