7వ పుట్టినరోజు జరుపుకున్న జడ్పీచైర్మన్…

దిశ ప్రతినిధి, కరీంనగర్: బర్త్ సర్టిఫికెట్లు లేని కాలంలో చాలా మందికి రెండు పుట్టిన రోజులు ఉండేవి. బడిలో టీచర్లు రాసిందే బర్త్ డేట్, లేదంటి తల్లిదండ్రులు చెప్పిన రోజే పుట్టిన రోజుగా సాగుతుంటుంది. కొంతమందికి అసలు పుట్టిన రోజుకు, రిజిస్టర్డ్ డేట్ బర్త్ కు కూడా సంబంధం ఉండదు. చాలా కాలం క్రితం వరకూ ఈ విధానం కొనసాగేది. ఇప్పటి జనరేషన్ వాళ్లు కూడా చాలా మందికి రెండు పుట్టిన రోజులు ఉంటాయి. ఇటీవల జనన, […]

Update: 2021-05-16 08:05 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: బర్త్ సర్టిఫికెట్లు లేని కాలంలో చాలా మందికి రెండు పుట్టిన రోజులు ఉండేవి. బడిలో టీచర్లు రాసిందే బర్త్ డేట్, లేదంటి తల్లిదండ్రులు చెప్పిన రోజే పుట్టిన రోజుగా సాగుతుంటుంది. కొంతమందికి అసలు పుట్టిన రోజుకు, రిజిస్టర్డ్ డేట్ బర్త్ కు కూడా సంబంధం ఉండదు. చాలా కాలం క్రితం వరకూ ఈ విధానం కొనసాగేది. ఇప్పటి జనరేషన్ వాళ్లు కూడా చాలా మందికి రెండు పుట్టిన రోజులు ఉంటాయి. ఇటీవల జనన, మరణ తేదీలను రిజిస్టర్ చేయాలన్న నిబంధనలను ప్రభుత్వం కఠిన తరం చేసింది. దీంతో ఇక నుండి ఎవరికైనా ఒకటే పుట్టిన రోజు అమలు కానుంది. కానీ ఈ ప్రజాప్రతినిధి మాత్రం కాస్తా డిఫరెంట్‌గా తన బర్త్ డే రోజును తానే ప్రకటించుకున్నారు. అప్పటి నుండి ఏటా అదే తన పుట్టిన రోజుగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే..?

పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్ ఆదివారం రోజున తన ఏడో బర్త్‌డే జరుపుకున్నారు. అదేంటీ ఓ జడ్పీ చైర్మన్ ఏడేళ్ల వయసులో ఉండడం ఏంటనుకుంటున్నారా..? ఆగండాగండి ఇందుకు ఓ స్టోరీ కూడా ఉంది. వాస్తవంగా 1972 ఏప్రిల్ 1న పుట్ట మధు జన్మదినం కానీ, తన పుట్టినరోజును మాత్రం ఆ రోజున జరుపుకోవడం లేదాయన. 2014 మే 16న ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఇక నుండి తన పుట్టినరోజును మే 16నే జరుపుకుంటానని, మంథని ప్రజల చీకటి రోజులకు చరమగీతం పాడినందున ఇక నుండి తన బర్త్ డే ఇదేనని ప్రకటించారు. అప్పటి నుండి ఆయన జన్మదినం ఏప్రిల్ 1న కాకుండా మే 16నే జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మంథనికి చేరుకున్న పార్టీ శ్రేణులు కూడా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుట్ట మధు కూడా కరోనాతో చనిపోయిన వారి దహన సంస్కారాల కోసం వైకుంఠ రథాలను కూడా నియోజకవర్గ ప్రజలకు అంకితం చేశారు. ఇది పుట్ట మధు పుట్టిన రోజు వెనక ఉన్న అసలు కథ.

Tags:    

Similar News