వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ విచారణకు ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ 68వ రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ వేదికగా సీబీఐ అధికారుల బృందం అనుమానితులను విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ కస్టడీకి తీసుకుంది. అలాగే పలువురు అనుమానితుల ఇళ్లల్లో నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. తాజాగా శుక్రవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. […]
దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ 68వ రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ వేదికగా సీబీఐ అధికారుల బృందం అనుమానితులను విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ కస్టడీకి తీసుకుంది. అలాగే పలువురు అనుమానితుల ఇళ్లల్లో నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. తాజాగా శుక్రవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. శంకర్‌రెడ్డితోపాటు పులివెందుల క్యాంప్ కార్యాలయంలో పని చేసే రఘునాథ్‌రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది.. వైఎస్ వివేకాను ఎవరెవరు కలిసేవారు.. వైఎస్ కుటుంబంలో ఏమైనా తగాదాలు ఉన్నాయా అన్న కోణంలో సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.