అమ్మవారి జాతరలో రికార్డింగ్ డాన్స్‌లు.. స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం
ఏపీ(Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా(Chittoor District) తంబళ్లపల్లె ముదివేడు దండు మారెమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు స్థానికంగా రాజకీయ రగడకు దారి తీసింది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా(Chittoor District) తంబళ్లపల్లె ముదివేడు దండు మారెమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు స్థానికంగా రాజకీయ రగడకు దారి తీసింది. జాతరలో సంప్రదాయంగా భక్తి శ్రద్ధలతో జరగాల్సిన కార్యక్రమాలను పక్కన పెట్టి.. అశ్లీల నృత్యాలు, నగ్న ప్రదర్శనలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విష సంస్కృతిని అధికార పక్షం పరిచయం చేసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో అసభ్య ప్రదర్శనలు కొనసాగుతున్న స్థానిక పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల ఈ తరహా సంఘటనలు జరుగుతున్నప్పటికీ స్థానిక పోలీసులు కనీసం పట్టించుకోకపోవడం పై ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ తరుణంలో అధికార పక్షం జోక్యం కారణంగా పోలీసులు సైతం పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం(Government) ఇలాంటి సంఘటనలను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రజెంట్ సామాజిక మాధ్యమా(Social Media)ల్లో వైరల్ అవుతున్నాయి.