పాపవినాశనం డ్యామ్లో బోటింగ్ టీటీడీ vs అటవీశాఖ
దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఈ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ఒకటి. ఈ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతో పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుపతి అటవీ ప్రాంతం (Tirupati forest area)పై అనేక ఆంక్షలు ఉంటాయి. ఈ క్రమంలో తిరుమల సమీపంలో ఉన్న పాపవినాశనం డ్యామ్లో బోటింగ్ (Boating in Papavinasanam Dam)పై అటవీశాఖ కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రాంతాన్ని ఎలాగైన పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తిరుమలను పర్యాటక కేంద్రం (Tourist center)గా భావించొద్దు అని టీటీడీ అనేకసార్లు అటవీశాఖకు విజ్ఞప్తి చేసింది. అయినప్పటికి తాజాగా.. సెక్యూరిటీ ఆడిటింగ్ (Security Auditing) పేరుతో డ్యామ్లో బోట్లతో ట్రయల్ రన్ చేశారు.
ఇదే వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు అటవీశాఖ అధికారులను ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పారు. పాపవినాశనం డ్యామ్ (Papavinasanam Dam)లో బోటింగ్ (Boating)పై యూటర్న్ తీసుకున్న అటవీశాఖ (Forest Department..).. అసాంఘిక కార్యకలాపాలు (Antisocial activities) జరుగుతున్నాయన్న సమాచారంతో తాము పాపవినాశనం డ్యామ్ సమీపంలో తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఈ సమాదానంపై తిరుమల శ్రీవారి భక్తులు (Devotees) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవిత్ర క్షేత్రం అయిన తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటే టీటీడీ విజిలెన్స్ (TTD Vigilance).. పోలీసుల వైఫల్యమేనని శ్రీవారి భక్తులు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో బోటింగ్ వ్యవహారంపై టీటీడీ(TTD), అటవిశాఖ మధ్య మరోసారి వివాదం నెలకొన్నట్లైంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.