ఆ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
2027 జూన్ నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు....
దిశ, వెబ్ డెస్క్: 2027 జూన్ నాటికి పోలవరం(Polavaram) ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) స్పష్టం చేశారు. పోలవరంలో పర్యటించిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని హామీ ఇచ్చారు. 2026 జూన్ నెల నాటికి ఎడవ కాలువను పూర్తి చేస్తామని చెప్పారు. ఇతర చిన్న పనులను సైతం 2026 డిసెంబర్‌కు పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం నిర్వాహితులందరికీ న్యాయం చేస్తామన్నారు. నిర్వాసితుల్లో ఒక్కరికీ కూడా అన్యాయం జరగడానికి వీల్లేదన్నారు. వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వం చారిత్రక తప్పిదం జరిగిందని, అది క్షమించరానిదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జగన్ ఏదేళ్ల కాలం రాజకీయ కక్షతోనే నడించిందని చంద్రబాబు గుర్తుచేశారు. గోదావరి వరద(Godavari flood)ల్లో డయాఫ్రమ్ వాల్(Diaphragm wall) దెబ్బతింటే ఆ విషయం కూడా జగన్‌కు తెలియదని ఆయన విమర్శించారు. కాఫర్ డ్యామ్ సకాలంలో పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదన్నారు. ఒక్కసారి ఓటే వేస్తే రాష్ట్ర జీవనాడిపై పూర్తి దెబ్బ కొట్టారని విమర్శించారు. ప్రాజెక్టుపై రాజకీయ కక్ష చూపెట్టారని ధ్వజమెత్తారు. రూ. 440 కోట్లతో నిర్మించిన డయా ఫ్రమ్ వాల్ నీటిలో కొట్టుకుపోయిందని, ఇప్పుడు మరోసారి కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 1941లోనే పోలవరానికి ప్రణాళకలు సిద్దమయ్యాయన్నారు. జగన్ హయాంలో పోలవరానికి జరిగిన నష్టాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లి సరి చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు తన హయాంలో పూర్తవుతున్నందన చాలా ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.