AP ICET-2025 నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ-ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్-2025 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఆచార్య ఎం.శశి ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ-ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్-2025 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఆచార్య ఎం.శశి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 09 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. రూ.1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 10 నుంచి 14 వ తేదీ వరకు, రూ. 2000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 15 నుంచి 19 తేదీ వరకు, రూ. 4 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 24 వ తేదీ వరకు, పదివేల రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 25 నుంచి 28 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల్లో ఎటువంటి తప్పులు దొర్లినా వాటిని సరి చేసుకోవడానికి ఏప్రిల్ 29-30 తేదీల్లో విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. విద్యార్థులు హాల్ టికెట్లను మే 2వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 7 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్ధులు సత్వరం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx సంప్రదించాలని కోరారు.