TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

తిరుమల(Tirumala) కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కనులారా వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు(Devotees) తరలివస్తారు.

Update: 2025-03-23 08:19 GMT
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కనులారా వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు(Devotees) తరలివస్తారు. ఈ తరుణంలో కాలినడకన స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఈ ఏడాది జూన్‌ నెలకు సంబంధించిన స్పెషల్ దర్శనం టికెట్ల కోసం భక్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 టికెట్) కోటా, వసతి టికెట్ల కోటా విడుదల తేదీని టీటీడీ ప్రకటించింది. రేపు(సోమవారం) ఉదయం 10 గంటల నుంచి దర్శనం టికెట్లు, రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి వసతి టికెట్ల బుకింగ్‌ను ప్రారంభం చేయనున్నట్లు పేర్కొంది. ముందుగా రూ.300 టికెట్లు లేదా ఇతర దర్శనం టికెట్లు పొందిన వారికి మాత్రమే వసతి గదుల బుకింగ్ సదుపాయం లభిస్తోందని టీటీడీ వెల్లడించింది.

Tags:    

Similar News