‘ఈటల’కు పొమ్మన లేక పొగబెట్టారు : షర్మిల
దిశ, వెబ్‌డెస్క్ : అసైన్డ్ ల్యాండ్ కబ్జా విషయంలో మంత్రి ఈటల రాజేందర్ పై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. అవినీతికి పాల్పడ్డవారు ఎంతటివారికైనా శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈటల రాజేందర్‌ను పొమ్మనలేక పొగపెడుతోందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తంచేశారు. అవినీత, ఆరోపణలు ఎదుర్కొంటున్న గులాబీ పార్టీ నేతలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల వెల్లడించారు.
దిశ, వెబ్‌డెస్క్ : అసైన్డ్ ల్యాండ్ కబ్జా విషయంలో మంత్రి ఈటల రాజేందర్ పై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. అవినీతికి పాల్పడ్డవారు ఎంతటివారికైనా శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈటల రాజేందర్‌ను పొమ్మనలేక పొగపెడుతోందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తంచేశారు. అవినీత, ఆరోపణలు ఎదుర్కొంటున్న గులాబీ పార్టీ నేతలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల వెల్లడించారు.